- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్: ఢిల్లీలోని ఇందిరా గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌లోని ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ సిస్టమ్‌లో శుక్రవారం ఉదయం ఈ సమస్య వచ్చింది. దీంతో విమానాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. దాదాపు 100కుపైగా విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయి. వీలైనంత త్వరగా ఈ సమస్యను పరిష్కరించేందుకు ప్రయత్నిస్తున్నాం’ అని అధికారులు తెలిపారు. ఫ్లైట్స్ అప్‌డేట్ కోసం ప్రయాణికులు విమానయాన సంస్థలను సంప్రదించాలని సూచించారు. ఏటీసీలో సాంకేతిక సమస్య కారణంగా విమానాలు ఆలస్యంగా నడుస్తున్నట్లు ఎయిర్ ఇండియా సహా పలు విమానాయనాన సంస్థలు తెలిపాయి.
- Advertisement -



