యూరియా కొరత తీర్చండి

– రైతుల ఆందోళన
నవతెలంగాణ-తాండూరు రూరల్‌
యూరియా కొరత తీర్చాలంటూ శనివారం ఎల్మ కన్నా సహకార సంఘం. బ్యాంకు వద్ద. రైతులు ఆందోళన చేశారు. ప్రభుత్వం రైతులకు సరిపడ్డ యూరియా సరఫరా చేయలేకపోతుందని పడిగాపులుగాస్తూ ఉన్నాగాని ఫలి తం లేకపోతుందన్నారు. ఈ విషయాన్నిపై అధికా రులకు తెలిపి రైతులకు సరిపడే యూరియా అందుబా టులో ఉంచాలని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. .ఓవైపు ప్రభు త్వం, రైతుల కోసం ఎరువులు విత్తనాలు అందుబాటులో ఉంచామని గొప్పలు చెబుతున్నా అవి మాటలకే పరిమి తమయ్యాయన్నారు. ఇప్పటికైనా స్పందించి ప్రతి రైతుకూ సరిపడే విధంగా యూరియా ఉంచకపోతే ఆందోళన చేయవలసి వస్తుందని రైతులు హెచ్చరించారు.

Spread the love