Friday, November 7, 2025
E-PAPER
Homeఆటలుపాకిస్థాన్‌పై భారత్ ఘన విజయం

పాకిస్థాన్‌పై భారత్ ఘన విజయం

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్ : పాకిస్థాన్‌పై రెండు ర‌న్స్ తేడాతో నెగ్గింది ఇండియా. హాంగ్‌కాంగ్ సిక్సెస్ టోర్నీలో దినేశ్ కార్తీక్ నేతృత్వంలోని భార‌త జ‌ట్టు డ‌క్‌వ‌ర్త్ లూయిస్ ప‌ద్ధ‌తిలో విజ‌యాన్ని న‌మోదు చేసింది. ఫ‌స్ట్ బ్యాటింగ్ చేసిన ఇండియా నిర్ణీత ఆరు ఓవ‌ర్ల‌లో 4 వికెట్ల న‌ష్టానికి 86 ర‌న్స్ చేసింది. ఇండియ‌న్ టీమ్‌లో ఓపెన‌ర్ రాబిన్ ఊత‌ప్ప అత్య‌ధికంగా 28 ర‌న్స్ చేశాడు. 11 బంతుల్లో రెండు ఫోర్లు, మూడు సిక్స‌ర్ల సాయంతో అత‌ను ఆ స్కోరు చేశాడు. తొలి వికెట్‌కు ఊత‌ప్ప‌, భార‌త్ చిప్లి 42 ర‌న్స్ జోడించారు.

దినేశ్ కార్తీక్ ఆరు బంతుల్లో రెండు ఫోర్లు, ఓ సిక్స‌ర్ సాయంతో 17 ర‌న్స్ చేసి నాటౌట్‌గా నిలిచాడు. 87 ర‌న్స్ టార్గెట్‌తో బ‌రిలోకి దిగిన పాకిస్థాన్‌.. 24 ప‌రుగుల వ‌ద్ద తొలి వికెట్‌ను కోల్పోయింది. అయితే మూడు ఓవ‌ర్లు వేసిన స‌మ‌యంలో్ వ‌ర్షం వ‌చ్చింది. దీంతో మ్యాచ్‌ను ర‌ద్దు చేశారు. మూడు ఓవ‌ర్ల‌లో పాక్ వికెట్ న‌ష్టానికి 31 ర‌న్స్ చేసింది. అయితే డ‌క్‌వ‌ర్త్ లూయిస్ ప‌ద్ధ‌తి ప్ర‌కారం పాక్ రెండు ప‌రుగులు వెనుక‌బ‌డి ఉండిపోయింది. దీంతో బార‌త్ రెండు ప‌రుగుల తేడాతో జ‌య‌కేతనం ఎగుర‌వేసింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -