- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: టాలీవుడ్ అగ్ర కథానాయకుడు రామ్‌చరణ్ టైటిల్ పాత్రలో నటిస్తున్న చిత్రం పెద్ది. ఈ సినిమాకు బుచ్చిబాబు సానా దర్శకత్వం వహిస్తుండగా.. వృద్ధి సినిమాస్ నిర్మిస్తుంది. జాన్వీ కపూర్ కథానాయికగా నటిస్తుండగా కన్నడ నటుడు శివరాజ్ కుమార్ కీలక పాత్రలో కనిపించబోతున్నాడు. ఈ చిత్రం వచ్చే ఏడాది మార్చి 27న ప్రేక్షకుల ముందుకు రానుంది.ఈ సందర్భంగా ఇప్పటినుంచే ప్రమోషన్స్ షురూ చేసింది చిత్రయూనిట్. ఇందులో భాగంగా ఫస్ట్ సింగిల్ ‘చికిరి చికిరి’ పాటను విడుదల చేసింది చిత్రయూనిట్. ఏఆర్ రెహమాన్ సంగీతం అందించిన ఈ పాట ప్రస్తుతం ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది.
- Advertisement -



