నవతెలంగాణ – కంఠేశ్వర్
సీపీఐ(ఎం) జిల్లా కమిటీ ఆధ్వర్యంలో పార్టీ కార్యాలయంలో 1917 అక్టోబర్ 26న రష్యాలో లెనిన్ నాయకత్వంలో మార్క్స్, ఏంగిల్స్ సిద్ధాంతానికి అనుగుణంగా రష్యాలో జార్ చక్రవర్తి దుష్ట పాలనకు వ్యతిరేకంగా పోరాడి విజయం సాధించిన దినోత్సవాన్ని పురస్కరించుకొని లెనిన్ చిత్రపటానికి పూలమాలలు వేసి శుక్రవారం నివాళులర్పించారు. అనంతరం సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి రమేష్ బాబు మాట్లాడుతూ.. ప్రపంచ మానవాళి విముక్తికి వర్గ పోరాటమే మార్గమని వర్గ పోరాటాల ద్వారా విప్లవం సాధించి దోపిడీ నుంచి విముక్తి పొందినప్పుడే సమాజం పురోగమిస్తుందని తెలిపిన మార్క్సి,ఎంగిల్స్ సిద్ధాంతాన్ని ఆచరణలో కార్యరూపం దాల్చి సమాజానికి నిరూపించిన వ్యక్తి లెనిన్ అని ఆయన అన్నారు.
దాని స్ఫూర్తితో ప్రపంచంలో అనేక దేశాలలో పెట్టుబడుతారు వ్యవస్థకు వ్యతిరేకంగా, ఫ్యూడల్ విధానాలకు వ్యతిరేకంగా పోరాడి విప్లవాలు సాధించినయని, అదే విధంగా నేడు నూతన ఆర్థిక సరళీకరణ విధానాలతో ప్రపంచ అభివృద్ధికి పెట్టుబడిదారీ విధానమే సరైన మార్గం అని చెప్పే అమెరికాలో కూడా నేడు ప్రజా తిరుగుబాటు ఎదురు కొంటున్న పరిస్థితులను చూస్తున్నామన్నారు. ఫలితంగా న్యూయార్క్ పట్టణంలో వాముపక్షవాది మేయర్ గా ఎన్నికైన విషయం తెలిసిందే అని ఆయన అన్నారు. నూతన సరళీకరణ ఆర్థిక విధానాల మూలంగా అనేక దేశాల్లో పేదరికం, నిరుద్యోగం, దారిద్రం పెరిగి తిరుగుబాట్లు బంగ్లాదేశ్ ,నేపాల్, శ్రీలంక తదితర దేశాల్లో వచ్చాయని అదేవిధంగా భారతదేశంలో సర్లీకరణ విధానాలతో పెట్టుబడిదారీ అనుకూల పద్ధతులను అవలంబించే నరేంద్ర మోడీ ప్రభుత్వం పైన ప్రజలు తీవ్ర అసంతృప్తితో పోరాటాలకు సిద్ధపడే పరిస్థితులు వస్తున్నాయని వర్గపోరాటాల ద్వారా మాత్రమే భారత దేశంలో లెనిన్ చూపిన మార్గంలో విప్లవం సాధించవచ్చు అని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు పెద్ది వెంకట్ రాములు, నూర్జహాన్, జిల్లా కమిటీ సభ్యులు సుజాత, నాయకులు నర్సింలు గంగాధర్, నరేష్, మురళి, రాజయ బేగం, యశోద, లక్ష్మీ సరుబీ తదితరులు పాల్గొన్నారు.



