నవతెలంగాణ-హైదరాబాద్: బీహార్ అసెంబ్లీ ఎన్నికలలో ఓట్లు చోరీ చేసి గెలవాలని బీజేపీ చూస్తోందని ప్రతిపక్షనేత రాహుల్ గాంధీ ఆరోపించారు. అందుకు అనుగుణంగా ఓటర్ లిస్ట్‌లో ఫేక్ ఓట్లను నమోదు చేసారని ఆయన మండిపడ్డారు. ప్రధాని మోడీ, అమిత్‌షా, కేంద్ర ఎన్నికల సంఘం హర్యానా ఎన్నికల్లో అక్రమాలకు పాల్పడ్డారని ఆయన ధ్వజమెత్తారు. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో బీహార్‌లోని బాగల్‌పూర్ నియోజవర్గంలో ఎన్నికల ర్యాలీలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ తరహా ధోరణిని బీహార్ యూత్ అంగీకరించారని, ఎన్నికల్లో తగిన బుద్ధి చెపుతారని అన్నారు.
హర్యానాలో 2 కోట్ల మంది ఓటర్లు ఉన్నారని, అందులో దాదాపుగా 25లక్షల నకిలీ ఓట్లు నమోదు చేశారని రాహుల్ గాంధీ ఆరోపించారు. ఈ ఓట్ల కుంభకోణంలో పీఎం మోడీ, అమిత్ షాలతో పాటు కేంద్ర ఎన్నికల సంఘం పాత్ర ఉందని, అందుకు సంబంధించిన ఆధారాలు ఉన్నాయని తెలిపారు. మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ లోక్ సభ ఎన్నికల్లో వారు ఓట్ చోరీకి పాల్పడ్డారని, అదే తరహాలో ఇప్పుడు బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఓట్ చోరికి ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు. జెన్ జెడ్ తరహా బీహార్ యూత్ ఓట్ చోరీని అడ్డుకుంటారని రాహుల్ గాందీ దీమా వ్యక్తం చేశారు.



