- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌లోని ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ లో సాంకేతిక లోపం తలెత్తడంతో దేశీయ, అంతర్జాతీయ విమాన సేవలు తీవ్రంగా ప్రభావితమయ్యాయి. ఈ లోపం కారణంగా 100కు పైగా విమానాలు ఆలస్యమయ్యాయి, మరికొన్ని రద్దు చేయబడ్డాయి. టేకాఫ్, ల్యాండింగ్ అనుమతుల్లో గందరగోళం నెలకొంది, దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పరిస్థితిని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) సమీక్షిస్తోంది. ఢిల్లీ నుంచి ముంబై, హైదరాబాద్, చెన్నై వంటి నగరాలకు వెళ్లే విమాన సేవలు కూడా ఆలస్యమయ్యాయి.
- Advertisement -



