Friday, November 7, 2025
E-PAPER
Homeఅంతర్జాతీయంఇండోనేషియాలో భారీ పేలుడు..

ఇండోనేషియాలో భారీ పేలుడు..

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్‌: ఇండోనేషియా రాజ‌ధాని జ‌క‌ర్తాలో భారీ పేలుడు సంభ‌వించింది. ఓ మ‌సీదులో శుక్ర‌వారం ప‌విత్ర ప్రార్థ‌నాలు నిర్వ‌హిస్తుండ‌గా ఒక్క‌సారిగా బాంబు పేలింది. ఈ ప్ర‌మాదంలో 54మందికిపైగా తీవ్ర గాయాలు అయ్యాయి. దీంతో సమాచారం అందుకున్న భ‌ద్ర‌తా సిబ్బంది..సంఘ‌ట‌నా స్థ‌లానికి చేరుకొని బాధితుల‌ను స్థానిక ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. ప్ర‌మాదం జ‌రిగిన మ‌సీదు ఓ స్కూల్ కు అతి ద‌గ్గ‌ర‌గా ఉంద‌ని, ఆ స‌మ‌యంలో పాఠ‌శాల ప్రాంగ‌ణంలో ఉన్న ప‌లువురు విద్యార్థుల‌కు గాయాలు అయిన‌ట్లు ఆ దేశ పోలీస్ ఆఫీస‌ర్ చెప్పారు. వారిని వెంట‌నే ఆస్ప‌త్రికి త‌ర‌లించామ‌న్నారు. అదే విధంగా బాంబు స్కాడ్వ్ సిబ్బంది సంఘ‌ట‌న చేరుకొని ద‌ర్యాప్తు చేప‌ట్టార‌ని తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -