Saturday, November 8, 2025
E-PAPER
Homeఅంతర్జాతీయంసిరియా అధ్యక్షుడిపై ఆంక్ష‌లు ఎత్తివేత‌

సిరియా అధ్యక్షుడిపై ఆంక్ష‌లు ఎత్తివేత‌

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్‌: సిరియా అధ్యక్షుడు అహ్మద్ అల్-షరా, అంతర్గత మంత్రి అనాస్ ఖత్తాబ్‌పై బ్రిటన్ ఆంక్షలను ఎత్తివేసింది. సోమవారం అల్-షరా, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మధ్య జరగనున్న సమావేశానికి ముందు ఈ నిర్ణయం వెలువడింది. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి కూడా ఆంక్షలను ఎత్తివేయడాన్ని పరిశీలిస్తోంది. అస్థిర ప్రాంతంలోని దేశాల మధ్య సంబంధాలను సాధారణ స్థితికి చేరుకుట అంతర్జాతీయ ప్రయత్నాలలో భాగంగా దీనిని చూస్తున్నారు. ఇస్లామిక్ స్టేట్ మరియు అల్-ఖైదా వంటి గ్రూపులతో సంబంధాలు ఉన్నట్లు అనుమానిస్తున్నందున నిషేధాలు విధించబడ్డాయి. మార్చిలో, బ్రిటిష్ ప్రభుత్వం సిరియా కేంద్ర బ్యాంకు, చమురు కంపెనీలపై ఆంక్షలను ఎత్తివేసింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -