- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: టీమ్ ఇండియా స్టార్ పేసర్ మహ్మద్ షమీ మాజీ భార్య హసీన్ జహాన్ రూ.4 లక్షల భరణం సరిపోవడం లేదని సుప్రీంకోర్టును ఆశ్రయించారు. నెలకు కనీసం రూ.10 లక్షలు భరణంగా నిర్ణయించాలని ఆమె కోరారు. పెరుగుతున్న జీవన వ్యయాలను, షమీ అధిక ఆదాయాన్ని పరిగణలోకి తీసుకోవాలని ఆమె విజ్ఞప్తి చేశారు. ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు షమీకి నోటీసులు జారీ చేసి, ఆయన సమాధానం కోరింది. “నెలకు రూ.4 లక్షలు ఇప్పటికే పెద్ద మొత్తం కాదా?” అని కోర్టు వ్యాఖ్యానించింది. తదుపరి విచారణలో భరణం పెంపుపై కోర్టు మరింత వివరంగా విచారించనుంది.
- Advertisement -



