‘గృహలకిë’లో అవకతవకలపై రాస్తారోకో

Write about the irregularities in 'Grihalakië'–  బీఆర్‌ఎస్‌ నేతలనే ఎంపిక చేస్తున్నారని తండావాసుల ఆగ్రహం
నవతెలంగాణ-ఆత్మకూరుఎస్‌
సూర్యాపేట జిల్లా ఆత్మకూర్‌ఎస్‌ మండలంలోని కొత్తతండాలో గృహ లక్ష్మి పథకం అమలులో అవకతవకలు జరిగాయని ఆరోపిస్తూ గ్రామస్తులు సూర్యాపేట – దంతాలపల్లి రహదారి పై శనివారం రాస్తారోకో చేశారు. రోడ్డుపై అడ్డంగా కట్టెలు వేశారు. ఈ సందర్భంగా కొత్తతండా మహి ళలు మాట్లాడుతూ.. అర్హులకు గృహలకిë పథకం వర్తింపజేయకుండా అనర్హులైన అధికార పార్టీ నాయకులను ఎంపిక చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇండ్లు, వ్యవసాయ భూములు ఉండి బీఆర్‌ఎస్‌లో పనిచేస్తున్న వారినే ఎంపిక చేయడం ఏంటని ప్రశ్నించారు. అద్దె ఇంట్లో ఉంటూ కూలీ పనులు చేస్తున్న పేదలను ఎంపిక చేయకపోవడం దారుణమన్నారు. పోలీసులు తండావాసులకు సర్దిచెప్పడంతో ఆందోళన విరమించారు. అదేవిధంగా పాతర్లపహాడ్‌ ఎక్స్‌రోడ్డు వద్ద బీజేపీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు.

Spread the love