Saturday, November 8, 2025
E-PAPER
Homeతాజా వార్తలుభర్త కళ్లెదుటే బస్సు చక్రాల కింద నలిగి భార్య మృతి..

భర్త కళ్లెదుటే బస్సు చక్రాల కింద నలిగి భార్య మృతి..

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్ : ఇష్ట దైవానికి మొక్కు తీర్చుకునేందుకు వెళ్తుండగా మృత్యు శకటంలా దూసుకొచ్చిన బస్సు.. భర్త కళ్లెదుటే భార్య ప్రాణాలు తీసింది. ఈ దుర్ఘటన విజయనగరం జిల్లాలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తెర్లాం మండలం పెరుమాలి గ్రామానికి చెందిన కొరగంజి సంఘంనాయుడు, భార్య శ్రీలత (43) చీపురుపల్లి మండలం రామలింగాపురంలోని మానసాదేవిని దర్శించుకునేందుకు శుక్రవారం సాయంత్రం బైక్‌పై బయల్దేరారు. గరివిడి మండలం చిన ఐతాంవలస సమీపంలో మలుపు దాటగానే ఎదురుగా వస్తున్న ఆర్టీసీ బస్సు వీరి బైక్‌ను ఢీకొట్టింది. వెనుక కూర్చున్న శ్రీలత రోడ్డుపైకి తుళ్లి పడిపోవడంతో ఆమె తలపై నుంచి బస్సు చక్రాలు వెళ్లాయి. ఘటనా స్థలంలోనే ఆమె మృతి చెందారు. గాయపడిన సంఘంనాయుడు.. భార్య మృతదేహాన్ని పట్టుకుని రోదించిన తీరు కంటతడి పెట్టించింది. సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాన్ని చీపురుపల్లి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. బాధితుడిని సంఘంనాయుడిని ఆసుపత్రిలో చేర్పించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -