నవతెలంగాణ-హైదరాబాద్: ఏప్రిల్ 22న జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గాంలో జరిగిన ఉగ్రదాడిలో 26 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ దాడి తామే చేశామని TRF వెల్లడించిన విషయం తెలిసిందే. తాజాగా పాకిస్థాన్ ఆధారిత ఉగ్రవాద సంస్థ లష్కర్-ఏ-తొయిబా అనుబంధ సంస్థ ది రెసిస్టెన్స్ ఫ్రంట్ (TRF) ను ఐక్యరాజ్యసమితి ఉగ్రవాద సంస్థల జాబితాలో చేర్చే దిశగా భారత్ తన కృషిని ముమ్మరం చేసింది. ఈ నేపథ్యంలో భారత ప్రభుత్వ ప్రతినిధి బృందం బుధవారం న్యూయార్క్‌లో ఐక్యరాజ్యసమితి ఉగ్రవాద వ్యతిరేక కార్యాలయం (UNOCT), కౌంటర్-టెరరిజం కమిటీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టరేట్ (CTED) అధికారులతో కీలక సమావేశాలు నిర్వహించింది. ఈ భేటీల్లో TRFను ఉగ్రవాద సంస్థగా గుర్తించాలన్న అంశంపై భారత బృందం తమ ఆధారాలను సమర్పించినట్లు సమాచారం. అంతర్జాతీయ వేదికలపై పాక్ చర్చలను ఎండగట్టానికి భారత్ ప్రతి అవకాశాన్ని అందిపుచ్చుకుంటుంది. ఈక్రమంలో భారత్ కీలక అడుగు వేసింది. ఐక్యరాజ్యసమితి ఉగ్రవాద సంస్థల జాబితాలో చేర్చే దిశగా భారత్ తన కృషిని ముమ్మరం చేసింది
TRFను ఉగ్రవాద సంస్థగా గుర్తించేలా ఐరాసలో భారత్ ప్రయత్నాలు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES