Saturday, November 8, 2025
E-PAPER
Homeజాతీయంమ‌ధ్య‌ప్ర‌దేశ్‌లో దారుణం..న్యూస్‌పేపర్‌లో చిన్నారులకు మధ్యాహ్న భోజనం

మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లో దారుణం..న్యూస్‌పేపర్‌లో చిన్నారులకు మధ్యాహ్న భోజనం

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్‌: బీజేపీ పాలిత రాష్ట్రం మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లో అవ‌మానీయ సంఘ‌ట‌న చోటుచేసుకుంది. శ్యోపుర్‌ జిల్లాలోని ఓ పాఠశాలలో చిన్నారులకు మధ్యాహ్న భోజనాన్ని న్యూస్‌పేపర్‌లో వ‌డ్డించారు. ఆ దృశ్యాలను కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ ‘ఎక్స్‌’ వేదికగా పోస్ట్‌ చేశారు. ‘నా హృదయం ముక్కలైంది. ఈ పిల్లలపైనే మన దేశ భవిష్యత్తు ఆధారపడి ఉంది. కానీ, వారికి కనీస గౌరవం దక్కడం లేదు. అక్కడ అభివృద్ధి అంతా భ్రమే. వ్యవస్థలను గుప్పిట్లో పెట్టుకొని అధికారంలోకి వస్తున్నారు. ఇటువంటి దుర్భర స్థితిలో పిల్లల భవిష్యత్తును తీర్చిదిద్దుతున్నందుకు అధికార నేతలు సిగ్గుపడాలి’ అని రాహుల్‌ గాంధీ పేర్కొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -