ఆగిన ట్రాఫిక్.. మరమ్మత్తులు పూర్తి..
నవతెలంగాణ – డిచ్ పల్లి
ఇందల్ వాయి మండల కేంద్రంలోని తిర్మన్ పల్లి రైల్వే గేట్ వేస్తున్న సమయం లో ఓ ఆటో వేగంగా వచ్చి గేట్ ని డీ కొనడంతో ఒక పక్క గేటు విరిగిపోయింది. దీంతో రైల్వే సిబ్బంది ప్రత్యామ్నాయ గేట్ ను తాత్కాలికంగా వేసి వాహనాలను నిలిపి వేసి, అదే సమయంలో వచ్చిన రైలు ను పంపించారు. సుమారు అరగంట పాటు బీంగల్, సిరికొండ ,దర్పల్లి ఇందల్ వాయి నుండి నిజామాబాద్, హైదరాబాద్ తోపాటు ఇతర గ్రామాలకు రాకపోకలు సాగించే వాహనదారులు విరిగిన గేట్ వద్ద అర్ గంట పాటు వాహనాలు నిలిచి పోయాయి. వాహనదారులు తివ్ర ఇబ్బందులుపడ్డారు. రైల్వే గేట్ మేన్ ఫిర్యాదు మేరకు రైల్వే పోలీసులు కేసు నమోదు చేసినట్లు అధికారులు తెలిపారు. విరిగిన గేటుకు మరమ్మత్తులు చేసి యదావిధిగా గేటు పడే విధంగా పనులను పూర్తి చేశారు.
రైల్వే గేట్ ను ఢీకొన్న ఆటో..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



