- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: రష్యాకు చెందిన Ka-226 హెలికాప్టర్ రిపబ్లిక్ ఆఫ్ డాగేస్తాన్‌లోని కాస్పియన్ సముద్ర తీరంలో కూలిపోయింది. ఈ ప్రమాదంలో పైలట్‌తో పాటు క్లిజియార్ ఎలక్ట్రోమెకానికల్ ప్లాంట్‌కు చెందిన నలుగురు ఉద్యోగులు మృతి చెందగా, మరో ఇద్దరు గాయపడ్డారని అధికారులు తెలిపారు. తోక భాగం విరిగిపోవడంతో హెలికాప్టర్ గాలిలో అదుపు తప్పి కుప్పకూలి పేలిపోయింది. ఆ దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
- Advertisement -



