అభివృద్ధి‌, సంక్షేమ పథకాలతో ఆదర్శం

– ఎమ్మెల్యే భాస్కర్‌రావు
మిర్యాలగూడ: అమలుతున్న అభివద్ధి సంక్షేమ పథకాలతో తెలంగాణ ఆదర్శంగా నిలిచిందని ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్‌ రావు అన్నారు. మిర్యాలగూడ మండలం దొండవారిగూడెం గ్రామంలో నివాసిత స్థలాల ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. గ్రామంలో 180 మందికి పట్టాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేసీఆర్‌ ప్రవేశపెట్టిన అభివద్ధి, సంక్షేమ పథకాలతో కేసీఆర్‌ మూడోసారి అధికారం చేపడతారన్నారు. దొండవారిగూడెం గ్రామానికి ఇప్పటి వరకు 11 కోట్ల 7 లక్షల 63 వేల 659 రూపాయలు మంజూరయ్యాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర ఆగ్రోస్‌ ఛైర్మెన్‌ తిప్పన విజయసింహరెడ్డి, రైతు బంధు సమితి జిల్లా అద్యక్షులు చింతరెడ్డి శ్రీనివాస్‌రెడ్డి, ఎంపీపీ నూకల సరళ హనుమంత్‌రెడ్డి, ఆర్డీఓ చెన్నయ్య, వైస్‌ ఎంపీపీి అమరావతి సైదులు, మిర్యాలగూడ మండల రైతు బంధుసమితి అధ్యక్షులు గడగోజు ఏడుకొండలు, మండల పార్టీ అద్యక్షులు మట్టపల్లి సైదులు యాదవ్‌, సర్పంచ్‌ ఎలకాని సుజాత రమణ, పాశం నరసింహరెడ్డి, మంజ్య నాయక్‌, ఎంపీటీసీ పాశం హైమవతి, గ్రామ పార్టీ అద్యక్షులు వీరమల్ల ఏడుకొండలు, చింతల వెంకటేశ్వర్లు, శ్రీకాంత్‌రెడ్డి, చీన్యా నాయక్‌, రెవిన్యూ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Spread the love