-సబ్ స్టేషన్ ఏర్పాటుకు ప్రతిపాదనలు
-అందనున్న నాణ్యమైన విద్యుత్
నవతెలంగాణ-మల్హర్ రావు
మండలంలో గాలి వీచినప్పడు, వర్షాలు పడినప్పుడు తీగల్లో బ్రేక్ డౌన్లతో విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడుతోంది. దీంతో వినియోగదారులకు నాణ్యమైన విద్యుత్ సరఫరాను అందించేందుకు విద్యుత్ సంస్థ అప్పటికప్పడు చర్యలును తీసుకుంటుంది. కాగా, గత ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు మండలంలోని తాడిచర్ల లో 132/33కేవీ సబ్ స్టేషన్ ఏర్పాటుకు ట్రాన్స్కోకు ప్రతిపాదనలు పంపించారు. మంత్రి ప్రతిపాదనల మేరకు ట్రాన్స్కో ఏడీ కుమారస్వామి ఇటీవల మండల కేంద్రమైన తాడిచర్ల,పెద్దతూoడ్ల గ్రామాల్లో ప్రభుత్వ స్థలం సేకరణపై ఆరా తీశారు.
కాటారం నుంచి సరఫరా..
మండలంలోని తాడిచర్ల, మల్లారం, కొయ్యూరు, పెద్దతూండ్ల, రుద్రారం గ్రామాలకు తాడిచర్ల ఏఎమ్మార్ కంపనీ సబ్స్టేషన్లకు కాటారం మండలం 132/33కేవీ సబ్ స్టేషన్ ద్వారా 30 నుంచి 40 కిలోమీటర్ల నుంచి విద్యుత్ సరఫరా అవుతుంది.కాగా, ప్రస్తుతం పెద్దపల్లి జిల్లా మంథని మండలం ఎగ్లాస్పూర్ నుంచి తాడిచర్ల గ్రామానికి లైన్లు ఏర్పాటు చేసి 132/33 కేవీ సబ్ స్టేషన్ ఏర్పాటు కానున్నుట్లు తెలుస్తుంది. ఈ సబ్ స్టేషన్ ద్వారా మండలంలోని పలు గ్రామాల్లో సబ్ స్టేషన్లకు తక్కువ దూరం నుంచి ఇన్కమింగ్ విద్యుత్ సరఫరా సేవలు అందనున్నాయి.
సమస్యలకు చెక్..
బ్రేక్ డౌన్, ప్రకతి వైపరీత్యాలు, సాంకేతిక కారణాల తో విద్యుత్ సరఫరా నిలిచిపోతే లైన్ మొత్తాన్ని తాడిచర్లలో ఏర్పాటు చేసిన సబ్ స్టేషన్ ఒక్కో స్తంభం వద్దకు వెళ్లి పరిశీలించాల్సిన అవ సరం ఉండదు. 33కేవీ ఫీడర్లలో విద్యుత్ అంతరాయం కలిగిన భాగాన్ని విభజిస్తుంది. ఏ ప్రాంతంలో సమస్య వచ్చిందో ఇండికేటర్లో సూచిస్తుంది. తీగలు ఒకదానికొకటి తగిలినా, తెగి కిందపడినా తెలిసిపో తుంది. లైన్లో ఎంత దూరంలో ఏ స్తంభం వద్ద సమస్య ఏర్పడిందో తెలుసుకునే వెసులుబాటు ఉంటుం దని విద్యుత్ శాఖ అధికారులు తెలుపుతున్నారు. తద్వారా విద్యుత్ వినియోగదారులకు మెరుగైన సరఫరాను అందించే అవకాశముంటుంది.
సమస్యగా స్థల సేకరణ
132/33 కేవీ సబ్ సబ్ స్టేషన్ ఏర్పాటుకు స్థల సేకరణకు విద్యుత్ శాఖకు తలకు మించిన భారం కానుంది. మండలంలో ప్రభుత్వ స్థలం లేదని రెవెన్యూ అధికారులు తెలుపుతున్నారు. సబ్ స్టేషన్ ఏర్పాటు కావాలంటే 3 నుంచి 5 ఎకరాల మేరకు ప్రభుత్వ స్థలం కావాల్సి ఉంది. తాడిచర్ల, మల్లారం , పెద్దతూండ్ల గ్రామాల్లో ప్రభుత్వ స్థలం ఉన్న చోట సబ్ స్టేషన్ ఏర్పాటు చేయనున్నారు.
సబ్స్టేషన్ ఏర్పాటు హర్షణీయం…
ఇప్ప మొoడయ్య….తాడిచెర్ల …పిఏసిఎస్ చైర్మన్
మండలంలోని తాడిచర్ల గ్రామంలో 132/38 కేవీ సబ్ స్టేషన్ ఏర్పాటుకు ప్రతిపాదనలు పంపడం హర్షణీయం. ఇన్కమీంగ్ నుంచి విద్యుత్ సర ఫరా నిలిచిన సమయంలో విద్యుత్ సమస్యను గుర్తించడానికి ఇబ్బం దులు పడాల్సి వస్తుంది. సబ్ స్టేషన్ నిర్మిస్తే సమస్యలు తొలగి నాణ్యమైన విద్యుత్ సర ఫరా అవుతుంది. సాధ్యమైనతం తర్వగా సబ్ స్టేషన్ ఏర్పాటుకు అధికారులు చర్యలు తీసుకోవాలి.సబ్ స్టేషన్ ఏర్పాటు కృషిపై మంత్రి శ్రీదర్ బాబుకు ప్రత్యేక కృతజ్ఞతలు.



