- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: దర్శకుడు రాజమౌళి, మహేష్ బాబుల కలయికలో వస్తున్న ‘SSMB29’ సినిమాపై అంచనాలు పెరుగుతున్నాయి. రోజుకో ఓ అప్డేట్ వస్తూనే ఉన్నాయ్. తాజాగా అందులో నటిస్తున్న ప్రియాంక చోప్రా పాత్ర పేరు, లుక్ పోస్టర్ ను నవంబర్ 11న విడుదల చేయనున్నారు. ఇక మహేష్ బాబు లుక్, చిత్రం పేరును నవంబర్ 15న జరిగే ఈవెంట్ లో రివీల్ చేయనున్నారు. ఈవెంట్ కోసం 100 అడుగుల ఎత్తు, 130 అడుగుల వెడల్పుతో స్టేజి ఏర్పాటు పనులు జరుగుతున్నాయి.
- Advertisement -



