నవతెలంగాణ – హైదరాబాద్: టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీని పురుషుల క్రికెట్ కమిటీ చైర్ పర్సన్‌గా మరోమారు నియమిస్తూ ఐసీసీ నిర్ణయం తీసుకుంది. అలాగే, గంగూలీ సహచరుడు వీవీఎస్ లక్ష్మణ్‌ను కూడా మరోమారు ప్యానల్ సభ్యుడిగా నియమించింది. ఈ మేరకు ఐసీసీ వెల్లడించింది. టీమిండియాను 2000వ సంవత్సరం నుంచి 2005 వరకు నడిపించిన గంగూలీ తొలిసారి 2021లో కమిటీ చైర్ పర్సన్‌గా నియామకమయ్యాడు. అప్పటి వరకు ఆ స్థానంలో సేవలు అందించిన దిగ్గజ స్పిన్నర్ అనిల్ కుంబ్లే స్థానంలో బాధ్యతలు చేపట్టాడు. 52 ఏళ్ల గంగూలీ మరో మూడేళ్లపాటు ఈ పదవిలో కొనసాగుతాడు.
- Advertisement -