నవతెలంగాణ – హైదరాబాద్: తెలంగాణ అమరనాథ్ యాత్రగా ప్రసిద్ధిగాంచిన సలేశ్వరం జాతరలో జరిగిన తొక్కిసలాటలో పలువురు భక్తులు గాయపడ్డారు. నాగర్ కర్నూలు జిల్లా నల్లమల అభయారణ్యంలోని సలేశ్వరం లింగమయ్య జాతరకు నిన్న చివరి రోజు కావడం, వారాంతం కావడంతో భక్తులు పోటెత్తారు. దీంతో స్వల్ప తొక్కిసలాట చోటుచేసుకుంది. లోయలో, చెప్పుల కురవ ప్రాంతానికి దిగువనగల ఇరుకు దారి చివర్లో భక్తులు ఒకరినొకరు నెట్టుకోవడంతో స్వల్పంగా తోపులాట జరిగింది. ఈ క్రమంలో కొందరు భక్తులు గాయపడ్డారు. పదేళ్ల చిన్నారి ఊపిరి ఆడక అస్వస్థతకు గురైంది. ఓ భక్తుడిపై పైనుంచి బండరాయి పడటంతో తలకు గాయమైంది.
- Advertisement -