నవతెలంగాణ-హైదరాబాద్ : వివాహేతర సంబంధం ఉందనే అనుమానంతో భార్యను భర్త కొట్టి చంపిన ఘటన అమీన్‌పూర్ ఠాణా పరిధిలో ఆదివారం చోటుచేసుకుంది. సీఐ నరేశ్ కథనం ప్రకారం.. గుంటూరు జిల్లాకు చెందిన చెవుల బ్రహ్మయ్య- క్రిష్ణవేణి (37) దంపతులు కొంతకాలంగా అమీన్‌పూర్ పట్టణం కేఎస్‌ఆర్ నగర్‌లో నివసిస్తున్నారు. క్రిష్ణవేణి కోహిర్ డీసీసీబీ బ్యాంకులో అసిస్టెంట్ మేనేజర్‌గా పనిచేస్తుండగా, బ్రహ్మయ్య రియల్ ఎస్టేట్ వ్యాపారి. ఇంటర్ చదివే పాప, ఎనిమిదో తరగతి చదువుతున్న బాబు ఉన్నారు. భార్యభర్తలకు ఒకరిపై ఒకరికి అనుమానం ఉంది. ఈ విషయమై తరచూ గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే ఆదివారం ఉదయం ఇద్దరి మధ్య ఘర్షణ జరిగింది. కోపంతో బ్రహ్మయ్య.. ఇంట్లో ఉన్న క్రికెట్ బ్యాట్‌తో క్రిష్ణవేణి తలపై కొట్టడంతో ఆమె అక్కడికక్కడే మృతిచెందింది. మృతురాలి తల్లి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
క్రికెట్ బ్యాట్‌తో కొట్టి భార్యను చంపిన భర్త
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



