- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్ : రచయిత అందెశ్రీ హఠాన్మరణం పట్ల బీఆర్ఎస్ పార్టీ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం సాగిన సాంస్కృతిక ఉద్యమంలో కవిగా తన పాటలు, సాహిత్యంతో కీలక పాత్ర పోషించిన అందెశ్రీ మరణం తెలంగాణ రాష్ట్రానికి తీరని లోటని అన్నారు. ఆయన రాసిన రాష్ట్ర గీతం ‘జయ జయ హే తెలంగాణ..’ విశ్వం ఉన్నంత వరకు అనునిత్యం ప్రతిధ్వనిస్తూనే ఉంటుందని తెలిపారు. ఉద్యమ కాలంలో అందెశ్రీతో తనకున్న అనుబంధాన్ని కేసీఆర్ నెమరువేసుకున్నారు. దివంగత అందెశ్రీ పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని.. ఆయన మరణం పట్ల విచారం వ్యక్తం చేస్తూ కేసీఆర్ సంతాపం ప్రకటించారు.
- Advertisement -



