Monday, November 10, 2025
E-PAPER
Homeతాజా వార్తలుఅలిపిరి మెట్ల మార్గంలో మాంసాహారం.. టీటీడీ కార్మికులపై వేటు

అలిపిరి మెట్ల మార్గంలో మాంసాహారం.. టీటీడీ కార్మికులపై వేటు

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్: తిరుమల కొండకు వెళ్లే పవిత్రమైన అలిపిరి మెట్ల మార్గంలో టీటీడీ కాంట్రాక్టు పారిశుద్ధ్య కార్మికులు బహిరంగంగా మాంసాహారం తినడం తీవ్ర కలకలం రేపింది. ఈ ఘటనపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేయగా, టీటీడీ అధికారులు స్పందించి, మాంసాహారం తిన్న రామస్వామి, సరసమ్మ అనే కార్మికులను ఉద్యోగాల నుంచి తొలగించి, పోలీసులకు ఫిర్యాదు చేశారు. తిరుమల పవిత్రతకు భంగం కలిగించే చర్యలను సహించబోమని అధికారులు స్పష్టం చేశారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అయింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -