Monday, November 10, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఉస్మానియా అలూమినీ అధ్యక్షుడిగా డాక్టర్ కృష్ణమూర్తి ఎన్నిక..

ఉస్మానియా అలూమినీ అధ్యక్షుడిగా డాక్టర్ కృష్ణమూర్తి ఎన్నిక..

- Advertisement -

నవతెలంగాణ – సుల్తాన్ బజార్ 
ఉస్మానియా అలూమినీ (పూర్వ విద్యార్థుల) అసోసియేషన్ అధ్యక్షుడుగా డాక్టర్ డాక్టర్ కృష్ణమూర్తి కృష్ణ ఎన్నికయ్యారు. ఈ మేర కు ఆదివారం కోఠిలోని ఉస్మానియ వైద్య కళాశాలలో జరిగిన ఉస్మానియా అలూమినీ ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో అలూమినీ అధ్యక్షులుగా డాక్టర్ కృష్ణమూర్తి భారీ మెజార్టీ తో ఘన విజయం సాధించారు. ప్రధాన కార్యదర్శిగా డాక్టర్ సత్యనారాయణ, కార్యవర్గ సభ్యులుగా డాక్టర్ సురేంద్ర బాబు, డాక్టర్ అనిత, డాక్టర్ కీర్తి స్వరూప్, డాక్టర్ కెయుఎన్ విష్ణు, డాక్టర్ నాగార్జున చక్రవర్తి, డాక్టర్ కె శంకర్, డాక్టర్ వి నరేష్ కుమార్, డాక్టర్ శ్రీనివాస్ చారి, డాక్టర్ సయ్యద్ జియావుద్దీన్ తదితరులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. నూతనంగా అలూమినీ అధ్యక్షులుగా ఎన్నికైన డాక్టర్ కృష్ణ మూర్తి, కార్యవర్గ సభ్యులు డాక్టర్ అనిత ను అలూమినీ మాజీ అధ్యక్షులు డాక్టర్ బిఎస్ శ్రీధర్, డాక్టర్ రవికుమార్ తో పాటు పలువురు వైద్యులు ఘనంగా సత్కరించి, అభినందించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -