నవతెలంగాణ – సుల్తాన్ బజార్
వీరనారి ఐలమ్మ మహిళా విశ్వ విద్యాలయం ఆవరణలో రెండు రోజులుగా కొనసాగుతున్న పుదుచ్చేరి చరిత్ర మూడవ మహాసభలు ఆదివారం ఘనంగా ముగిశాయి. ఈ సభలకు ముఖ్య అతిథిగా ఉస్మానియా యూనివర్సిటీ మాజీ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ కిషన్ రావు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ప్లీచ్ ఇండియా ఫౌండేషన్ సీఈవో ఈమని శివ నాగిరెడ్డి, పుదుచ్చేరి వరల్డ్ హిస్టరీ కాంగ్రెస్ అధ్యక్షుడు అరవింద్ కుమార్, ప్రధాన కార్యదర్శి సందీప్ కుమార్ దాసరి, లోకల్ సెక్రటరీ డాక్టర్ పి. అరుణ, ప్రిన్సిపాల్ డాక్టర్ లోక పావని, సీనియర్ ప్రొఫెసర్ వెంకట రాజం , డాక్టర్ రామానాయుడు,తదితరులు పాల్గొన్నారు. ముగింపు రోజున నిర్వహించిన 4 సెషన్ల లో 75 మంది పరిశోధనా పత్రాలు సమర్పించారు. అనంతరం పుదుచ్చేరి హిస్టరీ కాంగ్రెస్ జనరల్ బాడీ సమావేశాన్ని నిర్వహించడంతో 3వ మహాసభలు ముగిశాయి.
ఘనంగా ముగిసిన పుదుచ్చేరి మహాసభలు..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



