- Advertisement -
నవతెలంగాణ-హయత్ నగర్
రోడ్డుపై పోగొట్టుకున్న నగదును సాంకేతిక పరిజ్ఞానంతో క్షణాల్లో బాధితురాలికి పోలీసులు అందించిన ఘటన హయత్ నగర్ లో చోటుచేసుకుంది. ఇన్స్పెక్టర్ నాగరాజు గౌడ్ తెలిపిన వివరాల ప్రకారం.. అబ్దుల్లా పూర్ మెట్ మండలంలోని ఇనాంగూడకు చెందిన వనం ప్రకాష్ గౌడ్ తన తల్లితో ఇంటి నుండి అతని ద్వీచక్ర వాహనంపై హయత్ నగర్ కు వెళ్తున్న క్రమంలో మార్గ మధ్యలో బంగారు ఆభరణాలు పోగొట్టుకున్నారు. ఈక్రమంలో వారు హయత్ నగర్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. వెంటనే స్పందించిన పోలీసులు సాంకేతిక ఆధారాలతో 24 గంటల్లో బ్యాగ్ ఆచూకీ కనిపెట్టి బాధితురాలికి అప్పగించారు. దీంతో బాదితులు పోలీసులకు కృతజ్ఞతలు తెలిపారు.
- Advertisement -



