Monday, November 10, 2025
E-PAPER
Homeతాజా వార్తలురేపే ఉపఎన్నిక‌..డ్రోన్ కెమెరాల‌తో నిఘా

రేపే ఉపఎన్నిక‌..డ్రోన్ కెమెరాల‌తో నిఘా

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్‌: రేపు జరగబోయే జూబ్లీహిల్స్ బైపోల్‌కు ఎన్నికల సంఘం ఏర్పాట్లు పూర్తి చేసింది. ప్రతి పోలింగ్ కేంద్రంపై డ్రోన్ కెమెరాతో నిఘా పెట్టనున్నట్లు ఎన్నికల అధికారి ఆర్.వీ కర్ణన్ తెలిపారు. మొత్తం 407 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశాం. ఉప ఎన్నిక నిర్వహణలో 2600 మంది ఎన్నికల సిబ్బంది పాల్గొంటున్నార‌ని, జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో 4,01,365 మంది ఓటర్లు ఉన్నట్లు ప్రకటించారు. ఎన్నిక సందర్భంగా 2,400 మంది పోలీసులతో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు.

కోట్ల విజయ భాస్కర్ రెడ్డి స్టేడియంలో ఎన్నికల రిటర్నింగ్ అధికారి సమక్షంలో ఈవీఎంల పంపిణీ కొనసాగుతుంది. సాయంత్రం వరకు ఎన్నికల సిబ్బందికి ఈవీఎంల డిస్ట్రిబ్యూషన్ ప్రక్రియను ఎస్ఈసీ పూర్తి చేయనుంది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నిర్వహణలో 2600 మంది ఎన్నికల సిబ్బంది పాల్గొంటున్నారు. ఈ రోజు రాత్రి వరకు భారీ బందోబస్తు నడుము పోలింగ్ బూత్ లకు ఈవీఎంలు చేరుకోనున్నాయి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -