నవతెలంగాణ-హైదరాబాద్: హర్యానాలోని ఫరీదాబాద్‌లో 350 కిలోగ్రాముల ఆర్‌డిఎక్స్‌తోపాటు ఏకె-47 రైఫిల్‌ను జమ్మూకాశ్మీర్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వీటిని ఫరీదాబాద్ జిల్లాలోని ధౌజ్ గ్రామంలో ఉగ్రవాద నెట్‌వర్క్‌తో సంబంధం ఉన్న షకీల్ ఇంటి నుంచి మందుగుండు సామ్రాగిని స్వాధీనం చేసుకున్నారు. ఇంటెలిజెన్స్ బ్యూరో, జమ్మూకాశ్మీర్ పోలీసులు, అక్కడి స్థానిక పోలీసుల సహకారంతో ఫరీదాబాద్‌లో ఉగ్రవాద కుట్రను భగం చేశారు. అయితే పట్టుకున్నది ఆర్‌డిఎక్స్‌ని కాదని, అమ్మోనియం నైట్రేట్ అని పోలీసులు తెలిపారు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు త్వరలో వెల్లడిస్తామని ఫరీదాబాద్ పోలీస్ కమిషనర్ సతేందర్ గుప్తా మీడియాకు వెల్లడించారు.
కాగా, పోలీసులు ఈ సోదాల్లో 100 కిలోల బరువున్న 14 సంచుల అమ్మోనియం నైట్రేట్, ఒక ఎకె-47 రైఫిల్, 84 లైవ్ కార్ట్రిడ్జ్‌లు, టైమర్లు, ఐదు లీటర్ల రసాయన ద్రావణం, ఇంప్రూవైజ్డ్ ఎక్స్‌ప్లోజివ్ డివైస్‌లు అసెంబుల్ చేయడానికి ఉపయోగించేవిగా అనుమానించబడిన 48 ఇతర వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న పదార్థాలు అనేక అధిక తీవ్రత కలిగిన ఐఇడిలను తయారు చేయడానికి సరిపోతాయని, వీటితో గణనీయమైన నష్టాన్ని కలిగిస్తాయని అధికారుల దర్యాప్తులో తేలింది.
డాక్టర్ ముజాహిల్ షకీల్ నివాసం నుండి పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. ఈయన జమ్మూకాశ్మీర్ అల్ ఫలాV్‌ా మెడికల్ కాలేజీ విద్యార్థి. జమ్మూకాశ్మీర్‌కు చెందిన షకీల్ మూడు నెలల క్రితం ఫరీదాబాద్‌లో మూడు నెలల క్రితం ఇంటిని అద్దెకు తీసుకున్నారు. ఇతని ఇంటి నుంచే మందుగుండు సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు. షకీల్‌ని అక్టోబర్ 30న కస్టడీకి తీసుకున్నారు. ఉగ్రవాద నెట్‌వర్క్‌తో సంబంధం ఉన్న డాక్టర్ ఆదిల్ అహ్మద్ రాథర్‌ను పోలీసులు అరెస్టు చేశారు. ఉగ్రవాద నెట్‌వర్క్‌తో లింక్ ఉన్న షకీల్‌ను.. అహ్మద్ అరెస్టు తర్వాత కస్టడీలోకి తీసుకున్నారు. షకీల్‌ని పోలీసులు విచారణలో పేలుడు పదార్థాలను గుర్తించడానికి అతన్ని తిరిగి ఆదివారం ఫరీదాబాద్‌కు తీసుకువచ్చారు. పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో షకీల్, రాథర్ ఇద్దరికీ సరిహద్దు వెంబడి ఉగ్రవాద గ్రూపులతో సంబంధాలున్నాయని, వీరిద్దరూ ఉత్తర భారతదేశం అంతటా పెద్ద ఎత్తున దాడులు చేయడానికి ప్రణాళికలు వేసినట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు. పేలుడు పదార్థాల మూలాలను తెలుసుకోవడానికి, నెట్‌వర్క్‌తో సంబంధం ఉన్న ఇతర వ్యక్తులను గుర్తించడానికి వారిని ప్రశ్నిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.



