150 మస్టర్ల ఆబ్సెంట్పై ఎలాంటి ఒత్తిడి కార్మికులపై లేకుండా పాత విధానాన్ని అమలుపరచాలి
సొంత ఇంటి పథకం వెంటనే అమలు పరచాలి
మెడికల్ బోర్డును విధిగా కొనసాగించాలి
ఈనెల 19న హెచ్ఎంఎస్ ఆధ్వర్యంలో బాయ్ బాట జైత్రయాత్ర
గోశిక అశోక్,మహమ్మద్ ఇస్మాయిల్
నవతెలంగాణ – గోదావరిఖని: గతంలో సింగరేణి గుర్తింపు పొందిన యూనియన్ లో గెలిచిన ఏఐటీయూసీ యూనియన్ పేరుతో కార్మిక హక్కులను కాలరాశి వి ఆర్ ఎస్, గోల్డెన్ హ్యాండ్ షేక్ అంటూ కార్మికులను తీసివేశారని అలాగే హాస్పిటల్స్ అంబులెన్స్ పాఠశాలలనుకూడా తొలగింపు చేసి కార్మికులకు తీవ్ర అన్యాయం చేశారని హెచ్ఎంఎస్ డిప్యూటీ జనరల్ సెక్రెటరీ కేంద్ర కార్యదర్శి మహ్మద్ ఇస్మాయిల్ ధ్వజమెత్తారు గతంలో ఏఐటీయూసీ ఐఎన్టీయూసీ గుర్తింపు ప్రాథమిక సంఘాలుగా ఉన్నప్పుడే కార్మికులకు తీరిన అన్యాయం చేశారని అన్నారు.
ప్రస్తుతం ఏఐటిసి, ఐ ఎన్ టి సి నాయకులు ఉదయం మేనేజ్మెంట్ కౌన్సిలింగ్లో కూర్చుని సాయంత్రం జి.ఎం ఆఫీసులలో ధర్నా చేయటం ఏంటి అని ఈ ద్వంద వైఖరిని మానుకోవాలని సూచించారు నవంబర్ 19న కల్వకుంట్ల కవిత జాగృతి అధ్యక్షురాలు హెచ్ ఎం ఎస్ గౌరవాధ్యక్షురాలు అలాగే హెచ్ఎంఎస్ రాష్ట్ర అధ్యక్షులు రియాజ్ ఆధ్వర్యంలో సీఎండీ ఆఫీస్ హైదరాబాదులో ముట్టడి కార్యక్రమాన్ని నిర్వహించనున్నామని అన్నారు 150 మాస్టర్ల ఆప్షన్స్ ఆప్సేంట్ సర్కులర్ పై ఎలాంటి ఒత్తిడి కార్మికులపై లేకుండా గత పాదవిధానాన్ని కొనసాగించాలని డిమాండ్ చేశారు సొంత ఇంటి పథకం పట్ల ప్రస్తుతం ఉన్న యూనియన్లు స్పందించకపోవడం కార్మికులకు తీవ్ర అన్యాయం చేసినట్టే అని ఆరోపించారు.
హైదరాబాదులో సూపర్ స్పెషల్ హాస్పిటల్ విషయంలో కూడా నిమ్మకు నీరెత్తినట్టు మర్చిపోయారని ఆరోపించారు మెడికల్ బోర్డును యధాతరంగా కొనసాగించాలని అలాగే జిఎంఓ ,ఫోర్ మెన్, మెకానికల్ ,ఎలక్ట్రికల్ స్టాప్ మరియు జూనియర్ అకౌంట్స్ లకు a1 గ్రేడ్ కాకుండా ఏ గ్రేడ్ ఐదు సంవత్సరాలు ఉంటే ఏ వన్ గ్రేడ్ఇవ్వాలని డిమాండ్ చేశారు డెసిగ్నేషన్ మార్పు విషయమై మార్చి లోపల కూల్ ఇండియా ఇండియా కమిటీ రిపోర్ట్ ప్రకారం మార్చాలని సూచించారు మారుపేర్ల విషయం తొందరగా నిర్ణయం తీసుకోవాలని కార్మికులు న్యాయం చేయాలని కోరారు పర్సనల్ అసిస్టెంట్ గా పని చేస్తున్న ఉద్యోగులకు రిక్రూట్మెంట్ ద్వారా ఆఫీసర్ క్యాడర్ ఈవన్ గ్రేడ్ ఇవ్వాలని అన్ని గనుల్లో కబోర్డ్లు లాకర్స్ ఏర్పాటు చేయాలని 1000 రూపాయల లోపు పెన్షన్ పొందుతున్న కార్మికులకు పెంచాలని డిమాండ్ చేశారు అలాగే ఈనెల 19న హెచ్ఎంఎస్ ఆధ్వర్యంలో సింగరేణి వ్యాప్తంగా నిర్వహించి తలపెట్టిన బాయి బాట కార్యక్రమంలో గుర్తింపు పొందిన యూనియన్లు వాళ్లు కార్మికులకు అన్యాయం చేసిన తీరును ఏకరు పెట్టి కార్మికు లోపల చైతన్యం తీసుకువస్తామని వారు సూచించారు ఈ కార్యక్రమంలో డిప్యూటీ జనరల్ సెక్రెటరీ హెచ్ ఎం ఎస్ అశోక్ సెంట్రల్ కమిటీ మెంబర్ ఇస్మాయిల్ ఖాన్ అడ్రియాల ఇన్చార్జి వైస్ ప్రెసిడెంట్ శాంతి స్వరూప్ సెంట్రల్ బ్రాంచ్ సెక్రటరీ గోశిక శ్రీకాంత్ ఫిట్ సెక్రెటరీ ఎఎల్పి రేవల్లి రాజశేఖర్ సోషల్ మీడియా ఇంచార్జ్ ఎం రవికుమార్ ఆర్గనైన్ సెక్రటరీ రంగు అంజి సెక్రెటరీ ఇంచార్జ్ బి సంతోష్ టి కిరణ్ బి అనిల్ కుమార్ శ్రవణ్ నరేందర్ అమీర్ తదితరులు పాల్గొన్నారు
నల్ల చట్టాలను అమలు చేసి కార్మికుల హక్కులను కాలరాశారు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



