నవతెలంగాణ-హైదరాబాద్ : ముంబయి వసాయి విరార్ మున్సిపల్ కార్పొరేషన్ స్కామ్‌లో దర్యాప్తును ఈడీ ముమ్మరం చేసింది. దర్యాప్తులో భాగంగా గురువారం ముంబయి, హైదరాబాద్‌తో పాటు 13 ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు నిర్వహించింది. రూ.9.04 కోట్ల నగదు, రూ.23.25 కోట్లు విలువ చేసే బంగారం, వజ్రాలు స్వాధీనం చేసుకున్నట్టు ఈడీ తెలిపింది.
ముంబయిలోని మిరా భయాందర్ కమిషనరేట్ పరిధిలో నమోదైన కేసుల ఆధారంగా ఈడీ మరో కేసు నమోదు చేసింది. ప్రభుత్వ, ప్రయివేటు స్థలాల్లో అక్రమ నిర్మాణాలకు 2009 నుంచి అనుమతులు ఇచ్చారు. ఈ కేసులో సీతారాం గుప్తా, అరుణ్ గుప్తా కీలక నిందితులుగా ఉన్నారు. నిందితులు అధికారులతో కలిసి ప్రభుత్వ స్థలంలో అక్రమ నిర్మాణాలు చేపట్టి ప్రజలకు విక్రయించినట్టు దర్యాప్తులో తేలింది. ఇందులో భాగంగా వీవీఎంసీ టౌన్‌ప్లానింగ్ డిప్యూటీ డైరెక్టర్ వైఎస్ రెడ్డి నివాసంలో ఈడీ సోదాలు నిర్వహించింది. సోదాల్లో నిందితుల ఇళ్లలో నగదు, బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నట్టు ఈడీ తెలిపింది.
ఈడీ సోదాలు.. రూ.32 కోట్ల నగదు, బంగారం స్వాధీనం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES