- Advertisement -
నవతెలంగాణ-తంగళ్ళపల్లి : మండలంలోని అంకిరెడ్డిపల్లి గ్రామంలో గత మూడు రోజులుగా నిర్వహిస్తున్న బీరప్ప జాతరలో గురువారం మాజీ మంత్రి కేటీఆర్ బీరప్పను దర్శించుకుని మొక్కలు చెల్లించుకున్నారు. చిన్నారులు మంత్రి కేటీఆర్ తో సెల్ఫీ దిగేందుకు ఉత్సాహం చూపడంతో ఎవరికి కాదనకుండా కేటీఆర్ అందరితో సెల్ఫీ దిగారు. కాసేపు సరదాగా అందరితో మాట్లాడారు. ప్రజలందరిని సుఖసంతోషాలతో వర్ధిల్లేలా చూడాలని ఆయన కోరారు.
- Advertisement -