Tuesday, November 11, 2025
E-PAPER
Homeజాతీయంఢిల్లీ పేలుడు.. అమిత్ షా కీల‌క స‌మీక్ష‌

ఢిల్లీ పేలుడు.. అమిత్ షా కీల‌క స‌మీక్ష‌

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్‌: సోమవారం దేశ రాజధాని ఢిల్లీలో భారీ పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో 9 మంది మృతి చెందారు. 20 మందికి పైగా గాయాలయ్యాయి. ఈ ఘటనపై మంగళవారం కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా తన నివాసంలో ఉన్నత స్థాయి భద్రతా సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశం ఈరోజు ఉదయం 11 గంటలకు ప్రారంభమైంది. హోం శాఖా కార్యదర్శి గోవింద్‌ మోహన్‌, ఇంటిలిజెన్స్‌ బ్యూరో డైరెక్టర్‌ తపన్‌ దేకా, జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఎ) డైరెక్టర్‌ సదానంద్‌ వసంత్‌ డాటే, ఢిల్లీ పోలీస్‌ కమిషనర్‌ సతీష్‌ గోల్చా, జమ్మూ అండ్‌ కాశ్మీర్‌ డిజిపి నలిన్‌ ప్రభాత్‌లు ఈ సమావేశానికి వర్చువల్‌గా హాజరుకానున్నారు.

కాగా, సోమవారం సాయంత్రం 7 గంటల సమయంలో ఎర్రకోట మెట్రో స్టేషన్‌ గేట్లు 1-4 మధ్య ట్రాఫిక్‌ సిగల్‌ దగ్గర హ్యుండారు ఐ20 కారులో పేలుడు జరిగింది. ఈ సంఘటనకు సంబంధించిన దర్యాప్తులో ఎన్‌ఐఎ, ఎన్‌ఎస్‌జి, ఎఫ్‌ఎస్‌ఎల్‌, ఢిల్లీ పోలీసులు అన్నీ కలిసి దర్యాప్తు ప్రారంభించాయి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -