Tuesday, November 11, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్అక్రమంగా తరలిస్తున్న నల్లబెల్లం, పట్టిక స్వాధీనం

అక్రమంగా తరలిస్తున్న నల్లబెల్లం, పట్టిక స్వాధీనం

- Advertisement -
  • వివరాలు వెళ్లడించిన ఎక్సైజ్ సీఐ బద్యానాద్ చౌహాన్ 
  • నవతెలంగాణ-ఆమనగల్ 
  • అక్రమంగా తరలిస్తున్న నల్లబెల్లం, పట్టికను స్వాధీనం చేసుకున్నట్లు ఆమనగల్ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ సర్కిల్ ఇన్స్పెక్టర్ బద్యానాద్ చౌహాన్ తెలిపారు. ఈసందర్భంగా స్థానిక ఎక్సైజ్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన వివరాలు వెల్లడించారు. నమ్మదగిన సమాచారం మేరకు మంగళవారం కడ్తాల్ సమీపంలోని టోల్ గేట్ వద్ద వాహనాలు తనిఖీ చేస్తుండగా హైదరాబాద్ నుంచి కల్వకుర్తి వైపు వెళ్తున్న ఆటోలో అక్రమంగా తరలిస్తున్న 120 కిలోల నల్ల బెల్లంతో పాటు 120 కిలోల పట్టికను స్వాధీనం చేసుకొని అందుకు సంబంధించిన నిందితులు ప్రవీణ్, బిచ్చ లను అదుపులోకి తీసుకుని వారిపై కేసు నమోదు చేసినట్లు ఆయన చెప్పారు. అదేవిధంగా బెల్లం తరలిస్తున్న ఆటోతో పాటు రెండు సెల్ ఫోన్లను సీజ్ చేసినట్లు ఆయన పేర్కొన్నారు. తనిఖీల్లో ఎక్సైజ్ ఎస్ఐ అరుణ్ కుమార్, హెడ్ కానిస్టేబుల్ శంకర్, కానిస్టేబుల్స్ బాబు, శ్రీను, ఆమని తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -