Tuesday, November 11, 2025
E-PAPER
Homeఅంతర్జాతీయంహంగేరి ర‌చ‌యిత డేవిడ్ సాలేకు బూక‌ర్ ప్రైజ్

హంగేరి ర‌చ‌యిత డేవిడ్ సాలేకు బూక‌ర్ ప్రైజ్

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్‌: హంగేరికి చెందిన బ్రిటీష్ ర‌చ‌యిత డేవిడ్ సాలే .. 2025 బూక‌ర్ ప్రైజ్(Booker Prize 2025) గెలుచుకున్నారు. ఫ్లెష్ అనే న‌వ‌ల‌కు గాను ఆయ‌న‌కు ఈ అవార్డు వ‌రించింది. లండ‌న్‌లో సోమ‌వారం రాత్రి బూక‌ర్ ప్రైజ్ వేడుక జ‌రిగింది. భార‌తీయ ర‌చ‌యిత కిర‌ణ్ దేశాయ్ రాసిన ద లోన్లీనెస్ ఆఫ్ సోనియా అండ్ స‌న్నీ న‌వ‌ల తీవ్ర పోటీ ఇచ్చింది. కానీ చివ‌ర‌కు డేవిడ్ రాసిన న‌వ‌ల‌కు అవార్డు ద‌క్కింది.

51 ఏళ్ల డేవిడ్ సాలేకు సుమారు 50 వేల పౌండ్ల న‌గ‌దు పుర‌స్కారం అంద‌జేశారు. గ‌త ఏడాది విన్న‌ర్ స‌మంతా హార్వే చేతుల మీదుగా ట్రోఫీని బ‌హూక‌రించారు. కిర‌ణ్ దేశాయ్ రెండోసారి ఈ అవార్డు కోసం పోటీప‌డ్డారు. 2006లో రాసిన ద ఇన్‌హెరిటెన్స్ ఆఫ్ లాస్ న‌వ‌ల‌కు ఆమెకు బూక‌ర్ ప్రైజ్ వ‌చ్చింది. అయితే ఈ సారి కూడా ఆ అవార్డు కోసం ఆమె తీవ్ర పోటీప‌డ్డారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -