- – సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు.
నవతెలంగాణ-హిమాయత్ నగర్ : ప్రజల భవిష్యత్తు సమానత్వం, సౌభ్రాతృత్వం, ఆర్థిక న్యాయం ఆధారిత సోషలిస్టు వ్యవస్థలోనే ఉందని ఎమ్మెల్యే సాంబశివరావు పేర్కొన్నారు. సమాజంలో అసమానతలు, కుల వివక్ష, పేద–ధనిక మధ్య ఉన్న అంతరాలను తొలగించగల ఏకైక మార్గం సోషలిజమేనని ఆయన స్పష్టం చేశారు. జనసేవా దళ్ రాష్ట్ర సమితి పంజాల రమేష్ అధ్యక్షులుగా సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరైన సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు మాట్లాడుతూ.. సోషలిజ వ్యవస్థ స్థాపించడానికి ఆ దిశగా యువత ముందుకు రావడానికి.. శ్రీశ్రీ చెప్పినట్టు కొంతమంది యువత నవయుగ దూతలు అనే మాటలను స్ఫూర్తిగా తీసుకోవాలని ఆయన సూచించారు. నునుగు మిస్సాల యవనములో నే దేశ స్వతంత్రం కోసం ఉరి కంభం ఎక్కిన భగత్ సింగ్ స్ఫూర్తితో ఏర్పడిన యువజన, విద్యార్థి సమాఖ్య ల ఆధ్వర్యంలో సీపీఐ 100 సంవత్సరాల ముగింపు సందర్భంగా డిసెంబర్ 26న ఖమ్మంలో జరిగే భారీ బహిరంగ సభకు పదిహేను వేల మంది యువ కమ్యూనిస్టులతో భారీ జనసే వా దళ్ ర్యాలీ నిర్వహిస్తామన్నారు. యూరప్‌లో కమ్యూనిస్టుల గాలి వీస్తుందన్నారు.
నేపాల్ లో అన్ని వామపక్ష పార్టీల ఐక్యత కావడం.. రానున్నది సోషలిస్ట్ వ్యవస్థని అనేదానికి నిదర్శనమని అన్నారు. దేశం ఏండ్లతరబడి కార్పొరేట్ శక్తుల ఆధీనంలోకి వెళ్తోంది. పేదలకు న్యాయం జరగాలంటే, ఉత్పత్తి సాధనాలు ప్రజల చేతుల్లోకి రావాలి. అదే నిజమైన సోషలిజం,” అని సాంబశివరావు తెలిపారు.“సమాజంలో అణగారిన వర్గాల అభ్యున్నతికి రాజ్యాంగం ఇచ్చిన హక్కులను అమలు చేయడమే కాకుండా, ఆర్థిక సదుపాయాలు సమానంగా పంచడం కూడా అవసరం అని అన్నారు.



