- – దాతృత్వం చాటుకున్న సాయికుమార్ గౌడ్
– జిల్లా రక్తదాతల సేవా సమితి నిర్వాహకులు బోనగిరి శివకుమార్, ముదాం శ్రీధర్ పటేల్
నవతెలంగాణ – కామారెడ్డి
కామారెడ్డి పట్టణంలో ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో మానస అనే గర్భిణి మహిళకు అత్యవసరంగా ఆపరేషన్ నిమిత్తం బి పాజిటివ్ రక్తం అవసరం కాగా వారి కుటుంబ సభ్యులు జిల్లా రక్తదాతల సేవాసమితి నిర్వాహకులను సంప్రదించగా ఒక్క ఫోన్ చేయగానే కాచాపూర్ గ్రామానికి చెందిన పాలమకుల సాయికుమార్ గౌడ్ వచ్చి రక్తం ఇవ్వడం జరిగిందనీ రక్తదాతల సేవాసమితి నిర్వాహకులు తెలిపారు. ఈ సందర్భంగా రక్తదాత సాయికుమార్ గౌడ్ మాట్లాడుతూ తన జన్మదినం రోజు రక్తదానం చేయడం ఎంతో సంతోషంగా ఉంది అని ఇంత మంచి అవకాశం ఇచ్చిన రక్తదాతల సేవాసమితి నిర్వాహకులు బోనగిరి శివకుమార్ ముదాం శ్రీధర్ పటేల్ లకు కృతజ్ఞతలు తెలుపుతున్నాను అన్నారు. 18 సంవత్సరాలు నిండిన ప్రతి యువకులు రక్తదానం కు ముందుకు రావాలని కోరుతున్నాను అని ఈ సందర్భంగా యువకులకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సేవా సమితి ప్రతినిధి మ్యాన రాజు, బ్లడ్ సెంటర్ ప్రతినిధులు టెక్నీషియన్లు తదితరులు పాల్గొన్నారు.