- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్: జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పోలింగ్ ముగిసింది. సాయంత్రం 6గంటల వరకు క్యూలో ఉన్నవారికి.. ఓటు వేసేందుకు అధికారులు అవకాశం కల్పించారు. ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్(భారత రాష్ట్ర సమితి) మృతితో ఉప ఎన్నిక నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. 58 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఈ నెల 14న ఓట్ల లెక్కింపు జరగనుంది.
- Advertisement -



