- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్: ఛత్తీస్‌గఢ్‌లో మరోసారి ఎన్ కౌంటర్ జరిగింది.ఈ ఎన్‌కౌంటర్‌లో ఆరుగురు మావోయిస్టులు మృతిచెందారు. ఘటనా స్థలంలో మావోయిస్టుల మృతదేహాలతో పాటు భారీ స్థాయిలోపేలుడు పదార్థాలు, ఆయుధాలను భద్రతా బలగాలు స్వాధీనం చేసుకున్నారు. మృతిచెందిన వారిలో మావోయిస్ట్ అగ్రనేతలు ఉన్నట్లు తెలుస్తుంది. బీజాపూర్ జిల్లా నేషనల్ పార్క్ అటవీ ప్రాంతంలో మంగళవారం ఉదయం నుండి పోలీసులకు, మావోయిస్టులకు మధ్య భారీగా ఎదురుకాల్పులు కొనసాగుతున్నాయి. ఎదురుకాల్పులకు సంబంధించిన పూర్తి వివరాలు కూడా తెలియరాలేదు.
- Advertisement -



