మద్దతుకు అదనపు ధర చెల్లిస్తున్నాం
మిల్లర్స్ అధ్యక్షులు శ్రీనివాస్
నవతెలంగాణ – మిర్యాలగూడ
రైతులకు ఇబ్బంది లేకుండా ప్రతిరోజు రైస్ మిల్లుల వద్ద ఉదయం ఆరు గంటల నుంచి ధాన్యం కొనుగోలును చేస్తున్నామని మిర్యాలగూడ మిల్లర్స్ అధ్యక్షులు గౌరు శ్రీనివాస్ తెలిపారు. మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధరకు అదనముగా ధర ధాన్యానికి చెల్లించి మిల్లుల వద్ద కొనుగోలు చేస్తున్నామని ఆయన తెలిపారు. ఇప్పటివరకు మూడు లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశామని, మరో నాలుగు లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేస్తామన్నారు. ప్రతిరోజు 20 మెట్రిక్ టన్నుల ధాన్యం మిల్లుల వద్ద కొంటున్నామని, రైతులు తీసుకువచ్చిన ధాన్యాన్ని ఇబ్బందులు లేకుండా వెంటనే దిగుమతి చేసుకుంటున్నామన్నారు. నిరంతరం రైతులకు న్యాయం చేసేందుకు కృషి చేస్తామన్నారు.
ప్రతిరోజు 20 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేస్తున్నాం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



