Wednesday, November 12, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్శాంతి యుత నిరసనను భగ్నం చేసిన పోలీసులు

శాంతి యుత నిరసనను భగ్నం చేసిన పోలీసులు

- Advertisement -

నవతెలంగాణ-కాటారం : కాటారం మండల కేంద్రంలో వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో మంగళవారం చేపట్టిన శాంతియుత నిరసన కార్యక్రమాన్ని పోలీసులు భగ్నం చేసి, ఆందోళన కారులను పోలీస్ స్టేషన్ కు తరలించారు. కాటారం సబ్ డివిజన్ అభివృద్ధికై ప్రభుత్వం నిధులు కేటాయించి,వెనుకబడిన ప్రాంతాలను అభివృద్ధి పరచాలని డిమాండ్ చేస్తూ శాంతియుత నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. అనంతరం అత్కూరి శ్రీకాంత్ మాట్లాడుతూ… ప్రభుత్వాలు మారుతున్నాయి, ప్రజా ప్రతినిధులు వస్తున్నారు వెళుతున్నారు, కానీ ఈ ప్రాంతం అభివృద్ధికి మాత్రం నోచుకోవడం లేదని అన్నారు. ఈ ప్రాంత ప్రజల ఓట్లతో ఎమ్మెల్యేగా గెలిచి, ఐటీ శాఖ మంత్రిగా రాష్ట్రానికి ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు సొంత ఇలాఖాలో అభివృద్ధి కుంటుపడిందని గుర్తు చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం ఈ ప్రాంతంపై దృష్టి సారించి,నిధులు మంజూరు చేసి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలంటూ శాంతియుతంగా నిరసన తెలిపారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని నిర‌స‌న తెలుపుతున్న వారిని పోలీస్ స్టేషన్ కు తరలించారు.

సీపీఐ(ఎం) నాయకులను అరెస్ట్ ను కండీస్తున్నాం
బీఆర్ఎస్ ఎస్సీ సెల్ అధ్యక్షులు పంతకాని సడవాలి

కాటారం సబ్ డివిజన్ పరిధిలోని మండలాల అభివృద్ధికై ప్రత్యేక బడ్జెట్ కేటాయించాలని వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో నాయకులు శాంతియుతంగా నిరసన కార్యక్రమాన్ని నిర్వర్తిస్తుండగా పోలీసులు వచ్చి శాంతియుత దీక్షను భగ్నం చేసి నాయకులను అరెస్టు చేయడాన్ని బీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తుందని ఆయన తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -