Wednesday, November 12, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్మైనారిటీ హాస్టల్‌ లో ఘనంగా మైనార్టీ డే

మైనారిటీ హాస్టల్‌ లో ఘనంగా మైనార్టీ డే

- Advertisement -

నవతెలంగాణ – ములుగు : ములుగు మండలం దేవగిరి పట్నంలోని మైనార్టీ గురుకుల బాలికల పాఠశాలలో మంగళవారం మౌలానా అబుల్ కలాం ఆజాద్ జన్మదినాన్ని పురస్కరించుకుని మైనార్టీ వెల్ఫేర్ డే, జాతీయ విద్యా దినోత్సవ వేడుకలు పాఠశాల ప్రిన్సిపాల్ శ్రీలత ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా విద్యాధికారి సిద్ధార్థ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.ఈ సందర్భంగా మౌలానా అబుల్ కలాం ఆజాద్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించిన అనంతరం, విద్యాధికారి విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు. మైనార్టీ డేను పురస్కరించుకుని పాఠశాలలో ముందురోజే వివిధ పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు అందజేసి ప్రశంసించారు.అనంతరం విద్యార్థినులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ప్రేక్షకులను అలరించాయి. ఈ వేడుకలో బిఎల్ ఈడి సెక్రటరీ సూర్యనారాయణ, మైనార్టీ నాయకులు, జర్నలిస్టు లు సయ్యద్ వలి, ఎం.డి. జలీల్, జిల్లా మైనార్టీ నాయకులు ఎం.డి. హాజీ పాషా, ఎం.డి. షకీల్ అహ్మద్, విద్యార్థినిలు , ఉపాధ్యాయురాల బృందం, తల్లిదండ్రులు, నాన్ టిచింగ్ సిబ్బంది పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -