Wednesday, November 12, 2025
E-PAPER
Homeజాతీయంఢిల్లీ బాంబ్ పేలుడు..పెద్ద ఎత్తున విస్ఫోటనం..వీడియో

ఢిల్లీ బాంబ్ పేలుడు..పెద్ద ఎత్తున విస్ఫోటనం..వీడియో

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్ : ఢిల్లీ బాంబ్ పేలుడు యావత్తు దేశాన్ని కలవరపాటుకు గురిచేసింది. ఎర్రకోట ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర కారు బ్లాస్ట్ అయింది. పెద్ద ఎత్తున విస్ఫోటనం జరగడంతో ఒక్కసారిగా ఏం జరిగిందో తెలియక ప్రజలు అయోమయానికి గురయ్యారు. అక్కడికక్కడే కొందరు ప్రాణాలు కోల్పోగా.. ఇంకొందరు గాయపడ్డారు. మరికొందరు ప్రాణభయంతో పరుగులు తీశారు.


తాజాగా బాంబ్ బ్లాస్ట్‌కు సంబంధించిన దృశ్యాలు వెలుగులోకి వచ్చాయి. సోమవారం (10-11-2025) సాయంత్రం 6:50 గంటల ప్రాంతంలో ఎర్రకోట మెట్రో స్టేషన్ గేట్ నెంబర్-1 సమీపంలో ట్రాఫిక్ సిగ్నల్ ఉంది. దీంతో వాహనాలు నెమ్మదిగా కదులుతున్నాయి. ఇందులో హ్యుందాయ్ ఐ20 కారు ఒక్కసారిగా పేలిపోయింది. అధిక తీవ్రతతో కూడిన పేలుడు సంభవించింది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సీసీటీవీ ఫుటేజ్‌లో రికార్డైంది. సీసీటీవీ ఫుటేజ్ ఈరోజు వెలుగులోకి వచ్చింది. ఇక ఈ పేలుడులో ఇప్పటి వరకు 12 మంది చనిపోగా.. పలువురు గాయపడ్డారు. ప్రస్తుతం దర్యాప్తు సంస్థలు తీవ్రంగా విచారణ జరుపుతున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -