Wednesday, November 12, 2025
E-PAPER
Homeక్రైమ్పెళ్లి కావడం లేదని.. రైలు కింద పడి యువకుడి ఆత్మహత్య

పెళ్లి కావడం లేదని.. రైలు కింద పడి యువకుడి ఆత్మహత్య

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్ : పెండ్లి కావడం లేదని మనస్థాపానికి గురైన ఓ వ్యక్తి రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన మేడ్చల్ జిల్లా ఘట్కేసర్ రైల్వే స్టేషన్ దగ్గర్లోని.. మాధవరెడ్డి బ్రిడ్జి సమీపంలో జరిగింది. ఈ ఘటనతో యువకుడి కుటంబంలో విషాద ఛాయలు అలముకున్నాయి. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టు మార్టం తరలించారు.

పూర్తి వివరాల్లోకి వెళితే.. వరంగల్ జిల్లా ఆత్మకూరుకు చెందిన నరేష్ (30) అనే యువకుడు హైదరాబాద్ అమీర్ పేట్ లోని ఓ ప్రయివేటు హాస్టల్ లో ఉంటూ బట్టల షాపులో ఉద్యోగం చేస్తున్నాడు. గత నాలుగేళ్ల నుంచి ఎన్నో సంబంధాలు చూసినప్పటికి ఏ ఒక్కటి కుదరకపోవడంతో.. మానసింగా కుంగి పోయినట్లు కుటుంబ సభ్యులు వెల్లడించారు. దీంతో అమీర్ పేట నుంచి ఘట్కేసర్ కు చేరుకున్న నరేష్.. రేపల్లే ఎక్స్ ప్రెస్ కింద ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటనతో యువకుడి కుటంబంలో విషాద ఛాయలు అలముకున్నాయి. ఘటనా స్థలానికి చేరుకున్న రైల్వే పోలీసులు మృతదేహాన్ని పోస్టు మార్టం కోసం గాంధీ ఆస్ప‌త్రికి తరలించారు. అనంతరం కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -