Wednesday, November 12, 2025
E-PAPER
Homeఅంతర్జాతీయంనైపుణ్యం ఉన్న అమెరికన్‌ కార్మికులు లేరు : ట్రంప్‌

నైపుణ్యం ఉన్న అమెరికన్‌ కార్మికులు లేరు : ట్రంప్‌

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్‌: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ తన వైఖరిలో మార్పు చూపిస్తూ … దేశ అభివృద్ధికి విదేశీ నిపుణుల సేవలు అత్యవసరమని పేర్కొన్నారు. హెచ్‌ 1 బి వీసా వ్యవస్థపై గతంలో కఠిన వైఖరిని ప్రదర్శించిన ట్రంప్‌ … ఇప్పుడు అమెరికా శ్రామిక శక్తిలో తగినంత ప్రతిభావంతులు లేరని స్పష్టంగా అంగీకరించారు.

ఫాక్స్‌ న్యూస్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ట్రంప్‌ మాట్లాడుతూ … తయారీ, రక్షణ వంటి కీలక రంగాల్లో తగిన నైపుణ్యం ఉన్న అమెరికన్‌ కార్మికులు అందుబాటులో లేరని తెలిపారు. సరైన శిక్షణ లేకుండా నిరుద్యోగ అమెరికన్లను ఆ స్థానాల్లో నియమించడం సాధ్యం కాదని ఆయన వ్యాఖ్యానించారు. జార్జియాలోని ఓ రక్షణ రంగ ఫ్యాక్టరీ నుంచి పెద్ద మొత్తంలో విదేశీ కార్మికులను తొలగించడంతో ఉత్పత్తి వ్యవస్థ దెబ్బతిన్న ఉదాహరణను ట్రంప్‌ ప్రస్తావించారు. ”దక్షిణ కొరియా నుంచి వచ్చిన కార్మికులు బ్యాటరీ తయారీలో అద్భుత నైపుణ్యం కనబరుస్తున్నారు. అలాంటి రంగాలకు ప్రత్యేక నిపుణులు తప్పనిసరిగా అవసరం,” అని ట్రంప్‌ అన్నారు.

విదేశీ ప్రతిభ తప్పనిసరి : ట్రంప్‌
అమెరికన్‌ ఉద్యోగుల వేతనాలను పెంచడానికే తాను కృషి చేస్తున్నానని, కానీ పారిశ్రామిక, సాంకేతిక రంగాల పురోగతికి విదేశీ ప్రతిభను ఉపయోగించుకోవడం తప్పనిసరి ట్రంప్‌ స్పష్టం చేశారు. ట్రంప్‌ రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత తీసుకుంటున్న నిర్ణయాలు, ఇప్పుడు చేస్తున్న వ్యాఖ్యల మధ్య స్పష్టమైన మార్పు కనిపిస్తోంది. హెచ్‌ 1 బి వీసాలపై కఠిన చర్యలకు వ్యతిరేకంగా పెరుగుతున్న విమర్శలు, చట్టసభ్యుల ఒత్తిడి నేపథ్యంలో ట్రంప్‌ తాజా వ్యాఖ్యలు ఆయన దృక్కోణంలో మార్పుకు సంకేతాలుగా విశ్లేషకులు చెబుతున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -