Wednesday, November 12, 2025
E-PAPER
Homeతాజా వార్తలువరుసగా మూడో రోజూ సూచీల దూకుడు

వరుసగా మూడో రోజూ సూచీల దూకుడు

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్: దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా మూడో రోజు కూడా లాభాల జోరును కొనసాగించాయి. ఇవాళ్టి ట్రేడింగ్‌లో ఐటీ, ఫార్మా, ఆటో రంగాల్లో కొనుగోళ్ల ఉత్సాహం వెల్లువెత్తడంతో సూచీలు భారీ లాభాలతో ముగిశాయి. అంతర్జాతీయంగా సానుకూల సంకేతాలు, దేశీయంగా బలమైన ఆర్థిక పరిస్థితులు మదుపరుల సెంటిమెంట్‌ను బలపరిచాయి. ట్రేడింగ్ ముగిసే సమయానికి, బీఎస్ఈ సెన్సెక్స్ 595.19 పాయింట్లు లాభపడి 84,466.51 వద్ద స్థిరపడింది. అదేవిధంగా, ఎన్ఎస్ఈ నిఫ్టీ 180.85 పాయింట్లు పెరిగి 25,875.80 వద్ద ముగిసింది. బుధవారం ఉదయం సెన్సెక్స్ భారీ గ్యాప్-అప్‌తో 84,238.86 వద్ద ప్రారంభమైంది. రోజంతా కొనుగోళ్ల మద్దతుతో ఒక దశలో 84,652.01 వద్ద ఇంట్రా-డే గరిష్ఠాన్ని కూడా తాకింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -