Tuesday, April 29, 2025
Homeఅంతర్జాతీయంవజ్రాల వ్యాపారి మెహుల్ చోక్సీ అరెస్ట్..

వజ్రాల వ్యాపారి మెహుల్ చోక్సీ అరెస్ట్..

నవతెలంగాణ – హైదరాబాద్: పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్‌బీ) కుంభకోణం కేసులో పరారీలో ఉన్న వజ్రాల వ్యాపారి మెహుల్ చోక్సీని బెల్జియంలో అరెస్ట్. చేసినట్టు సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) తెలిపింది. రూ. 13,850 కోట్ల పీఎన్‌బీ కుంభకోణం బయటపడటంతో చోక్సీ జనవరి 2018లో ఇండియా నుంచి పరారయ్యాడు. సీబీఐతో పాటు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కూడా ఆయన కోసం తీవ్రంగా గాలిస్తోంది. చోక్సీపై ముంబై కోర్టు మే 23, 2018లో ఒకసారి, జూన్ 15, 2021లో మరోసారి అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. తాజా అరెస్ట్ నేపథ్యంలో అనారోగ్య కారణాలు చూపుతూ బెయిలు కోసం దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img