Wednesday, November 12, 2025
E-PAPER
Homeజాతీయంవెయ్యి సీసీ కెమెరాల‌తో ఢిల్లీ బ్లాస్ట్ కారు అన్వేష‌ణ‌

వెయ్యి సీసీ కెమెరాల‌తో ఢిల్లీ బ్లాస్ట్ కారు అన్వేష‌ణ‌

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్‌: ఢిల్లీ బాంబు పేలుడు ఘటనలో పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు. అందులో భాగంగా సీసీ ఫుటేజ్‌లను పరిశీలించారు. ఈ బాంబు పేలుడు తర్వాత దాదాపు 600 మంది పోలీసులు రంగంలోకి దిగి.. ఈ కారు ప్రయాణించిన మార్గాన్ని ట్రాక్ చేశారు. అందుకోసం దాదాపు 1000 సీసీ టీవీ ఫుటేజ్‌లను వారు పరిశీలించారు. ఆ క్రమంలో ఫరీదాబాద్‌లోని అల్ ఫలాహ్ యూనివర్సిటీ నుంచి సోమవారం ఉదయం హుండయి ఐ20 కారు బయలుదేరింది. ఇక ఉదయం 8.00 గంటలకు ఉమర్ ఢిల్లీలోకి ప్రవేశించగా.. దాదాపు 11 గంటల తరువాత అంటే సాయంత్రం 6, 7 గంటల సమయంలో పేలుడు సంభవించింది. ఈ మధ్య సమయంలో అతడు ఏం చేశాడనే విషయాన్ని తెలుసుకోవడంపై పోలీసులు ఫోకస్ చేశారు.

ఇక అతడి ఫోన్‌ గురించి పోలీసులు ఆరా తీయగా.. ఇక్కడా షాకింగ్ విషయాలు వెలుగు చూశాయి. ఉమర్ తన ఫోన్‌ను 10 రోజుల ముందే స్విచ్ ఆఫ్ చేసినట్లు గుర్తించారు. అంతేకాదు.. ఈ ఫోన్ కూడా అల్ ఫలాహ్ యూనివర్శిటీలో ఉన్నట్లు గుర్తించారు. అయితే ఉమర్ ఫోన్ లేకుండా ఎలా ఉన్నాడు. ఈ బాంబు దాడి వెనుక ఉన్న వారి ఆదేశాలు.. ఉమర్‌కు ఎలా అందాయి అనే కోణంలోనూ పోలీసులు విచారణ జరుపుతున్నారు. లేదంటే ఉమర్ వద్ద మరో ఫోన్ ఉందా? ఈ పేలుడులో ఆ ఫోన్ ధ్వంసమైందా? అని పోలీసులు సందేహం వ్యక్తం చేస్తున్నారు. ఆ దిశగా సైతం దర్యాప్తు జరుపుతున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -