నవతెలంగాణ – కామారెడ్డి
టీఎన్జీవోస్ కామారెడ్డి జిల్లా శాఖ ఆధ్వర్యంలో సమీకృత జిల్లా అధికారుల కార్యాలయాల సముదాయం లో జిల్లా పంచాయతి కార్యాలయం లో సభ్యత్వ నమోదు కార్యక్రమము టీఎన్జీవోస్ కామారెడ్డి జిల్లా అధ్యక్షులు నరాల వెంకట్ రెడ్డి అధ్యక్షతన జిల్లా శాఖ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా పంచాయితి కార్యాలయంలో విధులు నిర్వర్తిస్తున్న ఉద్యోగులు టీఎన్జీవోస్ సభ్యత్వాన్ని తీసుకున్నారు. 80 సంవత్సరాల చరిత్ర కలిగి ఉద్యోగుల సమస్యల పట్ల చిత్తశుద్ధితో పనిచేస్తున్న టీఎన్జీఓస్ సంఘంలో సభ్యత్వం తీసుకోవడం అనేది మా అదృష్టంగా భావిస్తున్నాము అని పంచాయతీ ఉద్యోగులు తెలిపారు. భవిష్యత్తులో ఉద్యోగుల. పెండింగ్ బిల్లులు, పి ఆర్ సి, డి ఎ లు , ఆరోగ్యకార్డులు, వివిధ సమస్యలపై పోరాడి సమస్యల పరిష్కారానికి టిఎన్జీవోస్ యూనియన్ మాత్రమే కృషి చేస్తోందని ఉద్యోగులు నమ్మకంతో ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో టీఎన్జీవోస్ కామారెడ్డి జిల్లా కార్యదర్శి ముల్క నాగరాజు, జిల్లా సహాధ్యక్షులు చక్రధర్, జిల్లా ఉపాధ్యక్షులు. లక్ష్మణ్ రాజేశ్వర్, సంయుక్త కార్యదర్శి రమణ కుమార్, జిల్లా ఎక్సిక్యూటివ్ మెంబర్ శ్రీకాంత్, జిల్లా పంచాయితి ఆఫీస్ ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు.



