- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: దక్షిణ అమెరికాలోని పెరూ దేశంలో ఘోర బస్సు ప్రమాదం జరిగింది. ట్రక్కును ఢీకొని బస్సు లోయలో పడిన ఘటనలో 37 మంది ప్రయాణికులు మరణించినట్లు AFP కథనం పేర్కొంది. పెరూ—చిలీ దేశాలను కలిపే హైవేపై జరిగిన ప్రమాదంలో 24 మంది గాయపడినట్లు వెల్లడించింది. అతివేగం, నాసిరకం రోడ్లు, అధికారులు సరైన చర్యలు తీసుకోకపోవడం వల్ల తరచుగా పెరూలో రోడ్డు ప్రమాదాలు జరుగుతుంటాయి.
- Advertisement -



